బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

- April 17, 2023 , by Maagulf
బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

రియాద్ : తూర్పు ప్రావిన్స్‌లోని ప్రత్యేక రహదారి భద్రతా దళాలు దమ్మామ్-రియాద్ హైవేపై తల్లిదండ్రుల వద్ద నుంచి తప్పిపోయిన చిన్నారిని ఎట్టకేలకు గుర్తించింది. ఆరోగ్యంగా ఉన్న ఆ చిన్నారిని కుటుంబసభ్యులకు అప్పగించారు. “తూర్పు ప్రావిన్స్‌లోని డమ్మామ్-రియాద్ హైవేపై బాధితులు తమ వాహనాన్ని ఆపినప్పుడు.. చిన్నారి వాహనం నుంచి దిగింది. కానీ ఇది గమనించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం జరిగిన పొరబాటును గుర్తించి.. తమ చిన్నారిని కాపాడాలని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు తప్పిపోయిన చిన్నారిని గుర్తించి వారి పేరెంట్స్ కు అప్పగించారు. ’’ అని స్పెషల్ రోడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. హైవే వినియోగదారులు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, రహదారులపై ప్రయాణించేటప్పుడు భద్రతా సూచనలను పాటించాలని వాహనదారులను ప్రత్యేక రహదారి భద్రతా దళాలు కోరాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com