అబుధాబి పోలీసుల నుండి ఈ మెసేజ్ అందుకున్నారా?
- April 18, 2023
యూఏఈ: అబుధాబి పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కు అనుగుణంగా జరిమానాలు కాకుండా..ఎమిరేట్‌లోని వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి హెచ్చరించే మెసేజ్ లను అందుకున్నట్లు తెలిపారు. అబుధాబిలోని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్లో కనిష్ట వేగం 120కిమీ కంటే తక్కువ వేగంతో నడిపినందుకు ఇటీవల 400 దిర్హామ్‌ల జరిమానా విధించారు. ఎడమ నుండి మొదటి రెండవ లేన్లకు పరిమితి వర్తిస్తుంది. కానీ భారీ వాహనాలకు వర్తించదని పోలీసులు స్పష్టం చేశారు. నెమ్మదిగా వెళ్లే వాహనాలు అవసరమైతే మూడవ లేన్‌ను ఉపయోగించవచ్చని, ఇక్కడ కనీస వేగ పరిమితి వర్తించదని తెలిపారు. ఏప్రిల్‌లో నిర్దేశిత మార్గాల్లో కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేయనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఆ తర్వాత మే 1 నుంచి జరిమానా వర్తిస్తుందని వారు తెలిపారు. ఇప్పుడు, ఈ రహదారిపై కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన వారికి హెచ్చరిక మేసెజ్ లు అందడంతో ఈ నియమం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్‌తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్‌గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!







