8శాతం వృద్ధిని సాధించిన సలాలా, సోహర్, దుక్మ్ ఓడరేవులు
- April 18, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ లో కీలకమైన సలాలా, సోహర్, దుక్మ్ ఓడరేవులు 8 శాతం వృద్ధిని సాధించాయి. 2022లో 62.3 మిలియన్ టన్నులకు పైగా సాధారణ కార్గోను కార్యకలాపాలను నిర్వహించాయి. కాగా 2021లో వృద్ధి రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. అయితే, లిక్విడ్ కార్గో హ్యాండిల్ విషయంలో 22 శాతం వృద్ధిని సాధించాయి. 2022లో 23.7 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా లిక్విడ్ కార్గో హ్యాండిల్ చేశాయి. మూడు ఓడరేవులలో నిర్వహించిన కంటైనర్ల సంఖ్య దాదాపు 5.2 మిలియన్ TEUలుగా ఉంది. 2022లో 6,500 కంటే ఎక్కువ ఓడలు పోర్టులలో కార్యకలాపాలు నిర్వహించాయి.
ప్రపంచ బ్యాంక్ జారీ చేసిన “కంటైనర్ పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2021” నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కంటైనర్ పోర్ట్‌ల ర్యాంకింగ్స్‌లో సలాలా పోర్ట్ రెండవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, ఓడరేవులో ఒక రోజులో నిర్వహించబడిన కంటైనర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 1157 కంటైనర్లకు చేరుకుంది. మరోవైపు, సోహార్ పోర్ట్ 2022లో సింగపూర్, మలేషియా పోర్ట్‌ల నుండి 100 శాతం పూర్తి ఆక్యుపెన్సీ రేటుతో "ASYAD లైన్స్" ద్వారా మొదటి బ్యాచ్ కంటైనర్‌లను అందుకుంది. ఇది ఈ లైన్ కోసం మాత్రమే 100,000 TEUల అంచనా వార్షిక ఆపరేటింగ్ వాల్యూమ్‌ని నమోదుచేసింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







