డయాబెటిస్‌కి దారి తీసే పరిస్థితులివే.!

- April 19, 2023 , by Maagulf
డయాబెటిస్‌కి దారి తీసే పరిస్థితులివే.!

అత్యంత సాధారణ వ్యాధిగా పరిగణించబడుతోంది ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్. 

వయసుతో సంబంధం లేకుండా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. జీన్స్‌లో డయాబెటిక్స్ ఎవరైనా వుంటే, ఆ వ్యాధి తర్వాత జనరేషన్ వాళ్లకు వచ్చే అవకాశం ఓ ఎత్తయితే, మారుతున్న జీవన శైలి ఈ వ్యాధి బారిన పడేందుకు ఎక్కువ దారి తీస్తోంది.

జన్యుపరమైన డయాబెటిస్‌ని టైప్ 1గా గుర్తిస్తే, కొన్ని సర్వేల ప్రకారం టైప్ 2 డయాబెటిస్‌కి అస్థవ్యస్థమైన జీవన విధానమే కారణమంటున్నారు సంబంధిత నిపుణులు. 

విశ్రాంతి తీసుకోవల్సిన సమయాన్ని టైమ్‌కి మించి మొబైల్, టీవీ వాడకం ద్వారా వేస్ట్ చేయడం టైప్ 2 డయాబెటిస్ బారిన పడేందుకు ఓ కారణంగా చెబుతున్నారు.

శారీరక శ్రమకు తగ్గట్టుగా తీసుకునే కేలరీల ఆహారం మోతాదు వుండాలి. అంటే ఎక్కువ సేపు కూర్చుని పని చేసే వారు తక్కువ కాలరీలున్న ఆహారం తీసుకోవాలి. 

వ్యాయామానికి ఖచ్చితంగా టైమ్ కేటాయించాలి. అలా చేయడం వల్ల కాస్త లేట్‌గా డయాబెటిస్ లక్షణాలు స్టార్ట్ అవ్వచ్చు. వ్యాయామానికి దూరంగా వుంటే, జీన్స్‌తో సంబంధం లేకుండా ఖచ్చితంగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మద్యం, ధూమపానం వినియోగం.. అధిక ఒత్తిడిచ ఊబకాయం తదితర అంశాలు టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదానికి సంకేతమవుతుందని అంటున్నారు. సో, జీవన శైలిలో ఆయా మార్పులు చేసుకోవడం తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com