బోగస్ జాబ్ రిక్రూట్మెంట్పై వార్నింగ్ అలెర్ట్
- April 19, 2023
బహ్రెయిన్: ఆన్లైన్ రిక్రూట్మెంట్ స్కామ్‌ల పెరుగుదల నేపథ్యంలో బహ్రెయిన్ వార్నింగ్ అలెర్ట్ జారీ చేసింది. బోగస్ జాబ్ రిక్రూట్మెంట్పై జాగ్రత్తగా ఉండాలని, జెన్యూన్ జాబ్ పోర్టల్‌లను పరిశీలించి.. సంబంధిత అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని ఉద్యోగార్థులను అధికారులను కోరారు. ఉద్యోగార్థులను సంప్రదించడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ ప్రకటనలను మోసగాళ్లు ఇస్తారని గుర్తుచేశారు. అనేక సందర్భాల్లో, రాజ్యంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చే ఏజెంట్లు "ప్రాసెసింగ్ ఫీ" పేరిట అభ్యర్థుల నుంచి దండుకొని మోసం చేస్తారని తెలిపారు. అలాగే వివిధ లింకులతో సోషల్ మీడియాలో ఉద్యోగార్ధులను ఆకర్షిస్తూ.. డబ్బు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని సంస్థలు ఉద్యోగుల నియామకానికి సంబంధించి ప్రముఖ సోషల్ మీడియా సైట్స్ తో సహా అనేక జాబ్ పోర్టల్లలో నకిలీ ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ వార్నింగ్ అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







