అబుధాబిలో రెస్టారెంట్ల కోసం $100M ఫండ్
- April 20, 2023
యూఏఈ: అగ్రశ్రేణి గ్లోబల్ రెస్టారెంట్ బ్రాండ్లను ఆకర్షించడంలో సహాయపడటానికి అబుధాబి $100 మిలియన్ల క్యులినరీ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇది ఎమిరేట్‌లో నివసించడానికి, పని చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం - అబుధాబి (డిసిటి అబుధాబి) తెలిపింది. ఈ ఫండ్ ద్వారా రంగానికి రిక్రూట్మెంట్, శిక్షణ, సిబ్బందికి సహాయం చేయడానికి కలినరీ పాఠశాలను నిర్మించడానికి, స్థాపించడానికి తోడ్పడుతుందని ప్రభుత్వ సంస్థ తెలిపింది. ఆహార భద్రతపై దృష్టి సారించే రెండు కొత్త డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెడుతుందని పేర్కొంది. కొత్త అబుధాబి క్యులినరీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్థానిక ఆస్తి భాగస్వాములతో సహ-పెట్టుబడి చేస్తుందని, అబుధాబి మార్కెట్లోకి ప్రవేశించడానికి అగ్రశ్రేణి చెఫ్‌లు, రెస్టారెంట్లు, క్యులినరీ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తుందని డిసిటి అబుధాబి తెలిపింది.
తాజా వార్తలు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే









