తేజు కమిట్మెంట్‌కి ఎలాంటి రిజల్ట్ రానుందో.!
- April 20, 2023
యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ పరిస్థితిని గురించి ఆయన సన్నిహితులు, బంధువులు ఇప్పటికే చాలా చెప్పారు. ‘విరూపాక్ష’ ప్రమోషన్లలో భాగంగా స్వయంగా తేజు అప్పటి పరిస్థితుల్ని తలచుకుంటూ ఫ్యాన్స్‌కి జాగ్రత్తలు చెబుతూనే తాను అనుభవించిన బాధను వివరిస్తుండడం నిజంగా మనసుకు కదిలించి వేస్తోంది.
ఇక ‘విరూపాక్ష’ సినిమా తేజుకి వెరీ వెరీ స్పెషల్ మూవీ. దాదాపు తేజుకిది యాక్సిడెంట్ తర్వాత పునర్జన్మగానే పరిగణించొచ్చు. ఈ తరుణంలో ఆయన నుంచి వస్తున్న ‘విరూపాక్ష’ సినిమాని కొత్త కోణంలో చూడాలంటున్నారు మేకర్లు.
అవును నిజమే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి భిన్నంగా తెరకెక్కిన సినిమా ఇది. సుకుమార్ అందించిన కథతో కార్తీక్ దండు ఈ సినిమాని తెరకెక్కించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఆరోగ్యం సపోర్ట్ చేయకున్నా.. కమిట్మెంట్‌తో ఏదో చేయాలన్న కసితో తేజు ఈ సినిమా పూర్తి చేశాడు. రిజల్ట్ ఏమొస్తుందో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 21) ‘విరూపాక్ష’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







