నాలుగేళ్లుగా కారునే జీవనం..భారతీయ మహిళకు అండగా నిలిచిన కాన్సులేట్

- April 21, 2023 , by Maagulf
నాలుగేళ్లుగా కారునే జీవనం..భారతీయ మహిళకు అండగా నిలిచిన కాన్సులేట్

యూఏఈ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత నాలుగు సంవత్సరాలుగా కారులో జీవిస్తున్న 55 ఏళ్ల భారతీయ జాతీయురాలు  ప్రియా ఇంద్రు మణికి దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అండగా నిలిచింది. తల్లికి పక్షపాతం రావడం, వ్యాపారంలో నష్టాలు వెరసి దుబాయ్‌లోని బార్షా హైట్స్‌లోని డెసర్ట్ స్ప్రింగ్స్ విలేజ్‌లోని తన విల్లాకు అద్దె చెల్లించలేకపోయింది. కొన్నాళ్లు ఒక హోటల్‌లో ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారడంతో కారులోనే నివసించవలసి వచ్చింది. సహాయం చేయాలని భారతీయ కాన్సులేట్‌ను మణి సంప్రదించగా.. విల్లా యజమానితో కాన్సులేట్‌ సిబ్బంది మాట్లాడారు. రమదాన్ సందర్భంగా దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (DEWA) బాకీతో సహా ఆమె మిగిలిన అప్పులను తీర్చడానికి అనేక మంది వ్యక్తులు ముందుకు వచ్చారు. కార్ ఫేర్ గ్రూప్ ఎండీ జస్బీర్ బస్సీ అద్దె కోసం AED 50,000, DEWA ఛార్జీల కోసం సుమారు AED 30,000 అందించారు. దాతల సహకార ప్రయత్నాల కారణంగా.. కాన్సులేట్ సమన్వయంతో మణికి ఆర్థిక ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా తనకు సహకరించిన వారికి మణి కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు ఉత్సాహాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. మణి పరిస్థితిని పరిష్కరించడంలో సానుభూతితో సహకరించినందుకు వినయ్ చౌదరి, అనీష్ విజయన్, జస్బీర్ బస్సీలకు కాన్సులేట్ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. ఇలాంటి చొరవలు యూఏఈలో భారతీయ సమాజంలోని బలమైన బంధాలకు ఉదాహరణగా నిలుస్తాయని కాన్సులేట్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com