సుధీర్ బాబు ట్రిపుల్ ధమాకా.! కొంచెం కొత్తగా ట్రై చేశాడుగా.!

- April 22, 2023 , by Maagulf
సుధీర్ బాబు ట్రిపుల్ ధమాకా.! కొంచెం కొత్తగా ట్రై చేశాడుగా.!

వెర్సటైల్ యాక్టర్‌గా సుధీర్ బాబుకి మంచి పేరుంది. ఆయన సినిమాల్లో కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వుంటాడు. అలా హిట్, ఫట్ అనే తేడాల్లేకుండా ఒక ప్రత్యేకమైన సక్సెస్‌ని దక్కించుకున్నాడు హీరోగా సుధీర్ బాబు.
అయితే, ఈ మధ్య సుధీర్ బాబు చేస్తున్న సినిమాలు ఆయన కెరీర్‌కి పెద్దగా కలిసి రావడం లేదు. తాజాగా ‘మామా మశ్చింద్ర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్ బాబు.
ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. విభిన్నమైన లుక్స్ ట్రై చేశాడు ఆయా పాత్రల కోసం. ఈ పాత్రల ఫస్ట్ లుక్స్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
లేటెస్టుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ‘దేవుడు అడిగాడట.. నన్ను చేరాలంటే ఏడు జన్మలు నా భక్తుడిలా వుంటావా.. లేక మూడు జన్మలు రాక్షసుడిలా వుంటావా అని. ఏడు జన్మలు నీకు దూరంగా వుండే కన్నా మూడు జన్మలు రాక్షసుడిలా బతకడమే మిన్న.. అని దేవతలే కోరుకుంటున్నారట..’ అంటూ మొదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.
ఓ పాత్ర కోసం సుధీర్ బాబు పక్కా తెలంగాణా యాసలో మాట్లాడుతున్నాడు.. టీజర్ చూస్తుంటే, ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలానే వుంది. ఆథ్యంతం ఆసక్తికరంగా ఎంటర్‌టైనింగ్‌గా టీజర్ కట్ చేశారు. చూడాలి మరి, ఈ సినిమాతో సుధీర్ బాబు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com