సూడాన్ నుండి సౌదీ పౌరుల తరలింపు ప్రారంభం

- April 23, 2023 , by Maagulf
సూడాన్ నుండి సౌదీ పౌరుల తరలింపు ప్రారంభం

రియాద్:  సౌదీ అరేబియా 5 నౌకల్లో సౌదీ పౌరులను.. ఇతర దేశాల పౌరులను సుడాన్ నుండి జెద్దాకు సముద్ర మార్గంలో తరలించడం ప్రారంభించింది. తరలింపు ప్రక్రియలో 158 మంది ఉండగా... జెడ్డా చేరుకున్న మొదటి బ్యాచ్‌లో 50 మంది ఉన్నారు. వారిని విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి ఇంజి. వలీద్ అల్-ఖెరీజీ స్వాగతం పలికారు. సుడాన్‌లోని రాయబారి అలీ బిన్ హసన్ జాఫర్ తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్,  క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు.. సౌదీ పౌరులను, ఇతర దేశాల నుండి అనేక మంది పౌరులను సూడాన్ నుండి రాజ్యానికి తరలించే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com