7G బృందావన్ కాలనీ సీక్వెల్..
- April 23, 2023
ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం కొడుకు రవి కృష్ణ హీరోగా పరిచయం అవుతూ నటించిన సినిమా 7G బృందావన్ కాలనీ. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. 2004 లో తమిళ చిత్రంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ ని అందుకుంది. నెల గ్యాప్ తరువాత తెలుగులో కూడా రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి యూత్ లో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది.
సోనియా అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సీనియర్ నటుడు చంద్రమోహన్ హీరో తండ్రి పాత్రలో కనిపించాడు. రవి కృష్ణ, చంద్రమోహన్ మధ్య చూపించిన ఫాదర్ అండ్ సన్ రేలషన్ మిడిల్ క్లాస్ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందించాడు. మూవీలోని ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికి ఈ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్ ప్లే లిస్ట్ లో ఉంటాయి.
కాగా ఇప్పుడు ఈ సినిమాకి రీమేక్ తీసుకు రాబోతున్నారు మేకర్స్. సెల్వరాఘవన్ ఇటీవల ‘నేనే వస్తున్నా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. తన తదుపరి సినిమాగా 7G బృందావన్ కాలనీ సీక్వెల్ ని పట్టాలు ఎక్కిస్తున్నాడట. ఫస్ట్ పార్ట్ లో హీరోగా కనిపించిన రవి కృష్ణ.. ఈ సీక్వెల్ లో కూడా మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ పార్ట్ లో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎ ఎం రత్నం నిర్మాణంలో యువన్ శంకర్ రాజా మ్యూజికల్ లో ఈ సీక్వెల్ రాబోతుంది. జూన్ నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









