హూరా మస్జీదులో భారీ అగ్నిప్రమాదం..!

- April 23, 2023 , by Maagulf
హూరా మస్జీదులో భారీ అగ్నిప్రమాదం..!

బహ్రెయిన్: హూరా ప్రాంతంలోని ప్రముఖ మస్జీదుకు అనుబంధంగా ఉన్న వంటగదిలో భారీ అగ్నిప్రమాదం జరగింది. ఈ ప్రమాదంలో  వ్యక్తి గాయపడినట్లు అధికారులు తెలిపారు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు.  కిచెన్ లో మొదలైన మంటలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఎంతమేర నష్టం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి వంటగదిలోని గ్యాస్ సిలిండర్ లీకేజీనే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని అంతర్గత మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com