మెగాస్టార్‌నే ఢీ కొట్టబోతున్న టిల్లుగాడు.!
- April 24, 2023
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే డేట్‌కి సందట్లో సడేమియా అంటూ ఓ యంగ్ హీరో కూడా దూసుకొస్తున్నాడు.
ఆయన మరెవరో కాదు.. డీజె టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ. ‘డీజె టిల్లు’తో యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడీ యంగ్ హీరో. ఈ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోందని అప్పుడే తెలుసు. అంతేకాదు, మొదటి పార్ట్‌కి వచ్చిన క్రేజ్‌తో అంతకు మించి అనేలా రెండో పార్ట్‌ని రూపొందిస్తున్నారు.
రాధిక పాత్రలో హీరోయిన్‌గా నేహా శెట్టి నటించగా, సెకండ్ పార్ట్ కోసం అనుపమా పరమేశ్వరన్ ఎంపికైంది. అనుకున్నట్లుగానే ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా రెండో టిల్లుగాడు రెడీ అవుతున్నాడట.
ఇక, ఈ క్రేజీ మూవీని చిరంజీవికి పోటీగా ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోందట. మెగాస్టార్‌తో పోటీ అంటే కూసింత ఆలోచించాల్సిందే కానీ, టిల్లుగాడికున్న క్రేజ్‌తో చిత్ర యూనిట్ ఈ సాహసానికి దిగబోతోందట. చూడాలి మరి, రెండో టిల్లుగాడు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయనున్నాడో.
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!









