జేమ్స్ గన్ నోట ఎన్టీయార్ మాట.!
- April 26, 2023
ప్రముఖ హాలీవుడ్ ఫిలిం మేకర్ జేమ్స్ గన్‌కి ఎన్టీయార్ తెగ నచ్చేశాడట. ఆయనతో కలిసి పని చేయాలని వుందని తన మనసులో మాట బయట పెట్టారు.
‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ డైరెక్టర్ అయిన జేమ్స్ గన్ ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తెలుగు యాక్టర్స్‌తో కలిసి పని చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు.? అని విలేఖరి అడగ్గా.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన ఎన్టీయార్ తనకు బాగా నచ్చాడనీ, ఒకవేళ భవిష్యత్‌లో కలిసి పని చేయాల్సి వస్తే, ఎన్టీయార్‌తో కలిసి పని చేస్తా.. అని జేమ్స్ గన్ అన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీయార్‌లు గ్లోబల్ స్టార్స్‌గా గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతంలో రామ్ చరణ్‌ని ప్రశంసిస్తూ ప్రముఖ హాలీవుడ్ ఫిలిం మేకర్ జేమ్స్ కెమెరూన్ ఇలాగే స్పందించారు. తాజాగా ఎన్టీయార్ మరో ప్రముఖ హాలీవుడ్ ఫిలిం మేకర్ హార్ట్ టచ్ చేశాడు.
ఏది ఏమైనా భవిష్యత్‌లో ప్రెస్టీజియస్ హాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఎన్టీయార్, రామ్ చరణ్ భాగం కావడం పక్కా అని తెలుస్తోంది. ఆల్రెడీ రామ్ చరణ్ కొన్ని హాలీవుడ్ ప్రాజెక్టులతో కనెక్ట్ అయ్యి వున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









