తగ్గేదేలే.. త్వరలో రషీద్ రోవర్-2 ప్రయోగం: షేక్ మొహమ్మద్
- April 27, 2023
యూఏఈ: యూఏఈ నిర్మించిన రషీద్ రోవర్ ప్రయోగం విఫలం కావడంతో.. త్వరలోనే రోవర్ రషీద్ 2 ప్రయోగం చేపట్టనున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. రషీద్ రోవర్‌ను తీసుకెళ్లిన హకుటో-ఆర్ మిషన్ 1 అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితలంపై కూలిపోయిన విషయం తెలిసిందే. బుధవారం దుబాయ్ పాలకుడు మహ్మద్ బిన్ రషీద్ అంతరిక్ష కేంద్రాన్ని (MBRSC) సందర్శించారు. చంద్రునిపై రోవర్‌ను ల్యాండ్ చేసే కొత్త రషీద్ 2 ప్రాజెక్ట్ పనులను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. రషీద్ 1 చంద్రుని ఉపరితలంపై "ఎమిరేట్స్ జెండాను మోస్తున్నట్లు" షేక్ మహమ్మద్ చెప్పారు. రెండు రోవర్లకు ఆధునిక దుబాయ్‌ని నిర్మించిన దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ పేరు పెట్టారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







