పదేళ్ల కుమార్తెను బాత్‌టబ్‌లో ముంచి చంపిన తల్లికి జీవితఖైదు
- April 27, 2023
దుబాయ్: తూర్పు యూరప్‌కు చెందిన 38 ఏళ్ల తల్లి తన పదేళ్ల కూతురిని చిత్రహింసలకు గురిచేసి చంపినందుకు దుబాయ్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసు ఫైల్ ప్రకారం.. తన కుమార్తె బాత్‌టబ్‌లో మునిగిపోయిందని చెప్పి తల్లి అంబులెన్స్‌ను పిలిచింది. పోలీసులు వెళ్లి విచారించగా.. పదేళ్ల చిన్నారి శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలితో పాటు ఇంట్లో ఉంటున్న తల్లిని, రెండేళ్ల వయసున్న మరో చిన్నారిని పోలీసులు విచారించారు. ఆ ఇంట్లో పని చేసే ఓ సర్వెంట్ తన కూతురిని బాత్‌టబ్‌లో ముంచి దేశం విడిచి పారిపోయాడని తల్లి ఆరోపించింది. కానీ, నేరం జరిగిన రోజున ఆ సర్వెంట్ దేశం విడిచి వెళ్లిపోయాడని పోలీసులు గుర్తించారు. ఇంటర్‌పోల్ ఆ సర్వెంట్ ను అతని స్వదేశంలోని విమానాశ్రయంలోని అరైవల్ హాల్‌లో పట్టుకుంది. అతన్ని విచారించగా, అతను నేరంలో పాల్గొనలేదని తెలిపాడు. తాను కొన్ని నెలల క్రితం ఎమిరేట్‌కి వచ్చానని, ఇంటి పనుల్లో సహాయం చేయడం, ఇద్దరు పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లడం, తీసుకురావడం తన పని అని పోలీసులకు చెప్పాడు. బాలికను తల్లి తరచూ చిత్రహింసలకు గురిచేయడం, శారీరకంగా, మానసికంగా వేధించడం గమనించానని చెప్పాడు. నేరం జరగడానికి ముందు రోజు తల్లి తన కుమార్తెను తన గదిలోకి లాక్కెళ్లడం చూశానని సర్వెంట్ అధికారులకు తెలిపాడు. నేరం జరిగిన రోజు ఉదయం బాలికను పాఠశాలకు నిద్ర లేపేందుకు వెళ్లి చూడగా ఆమె బెడ్‌రూంలో కనిపించలేదని, బాత్‌రూమ్‌లో నుంచి చిన్నపాటి నీళ్ల శబ్దం రావడంతో తలుపులు తెరిచి చూడగా బాలిక బాత్‌టబ్‌లో పడి ఉందని, ఆమె తల్లి వద్దకు వెళ్లి కూతురు చనిపోయిందని తెలిపినట్లు పేర్కొన్నాడు. అయితే, తను వార్త చెప్పగానే తల్లి ప్రశాంతంగా స్పందించడంతో షాక్ అయినట్లు, నేరం తనపై పడుతుందనే భయంతో వెంటనే స్వదేశానికి పారిపోయాయని వివరించాడు. సర్వెంట్ వాంగ్మూలం ఆధారంగా చేపట్టిన విచారణలో తల్లి నేరాన్ని అంగీకరించింది. తన కుమార్తెపై దాడి చేసి బాత్‌టబ్‌లో ముంచివేసినట్లు ఆమె అంగీకరించింది. కాగా, జరిగిన నేరాన్ని పోలీసులకు తెలపనందుకు సర్వెంట్ కి దుబాయ్‌లోని మిస్‌డిమినర్ కోర్టు ఒక నెల జైలు శిక్ష, తరువాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







