తెలంగాణ నూతన సచివాలయంలో ప్రారంభమైన పూజలు

- April 30, 2023 , by Maagulf
తెలంగాణ నూతన సచివాలయంలో ప్రారంభమైన పూజలు

హైదరాబాద్‌: తెలంగాణకే తలమానికంగా మారిన నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేటి మధ్యాహ్నం 1.20-1.32 మధ్య ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నూతన సచివాలయంలో ఈ తెల్లవారుజామున 5.50 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 6.15 గంటలకు ప్రారంభమైన చండీయాగం, సుదర్శన యాగాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. హౌమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్లలో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు పాల్గొంటారు. శృంగేరీ పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, వాస్తు పండితుడు సుద్దాల సుధాకర తేజ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com