సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 6 మంది తోబుట్టువులు మృతి
- May 03, 2023
రియాద్: తైఫ్ గవర్నరేట్‌ను అల్-బహా ప్రాంతాలతో కలిపే రహదారి వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాదకరమైన కారు ప్రమాదంలో 6 మంది తోబుట్టువుల మరణించడం విషాదాన్ని నింపింది. వారి తల్లిదండ్రులు, ముగ్గురు ఇతర తోబుట్టువుల పరిస్థితి విషమంగా ఉన్నందున వారిని ఇంటెన్సివ్ కేర్‌కు తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో ఢీకొన్న రెండవ కారును నడుపుతున్న అరవై ఏళ్ల డ్రైవర్ కూడా మరణించాడు. అయితే ఒక 4 ఏళ్ల బాలిక ప్రాణాలతో క్షేమంగా బయటపడటం విశేషం. తన సోదరుడు అహ్మద్ కుటుంబం మదీనా నుండి అల్-బహాకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం సంభవించిందని మహమ్మద్ సలేం అల్-గమ్ది తెలిపారు. ప్రమాదంలో మరణించిన 6 మంది తోబుట్టువులు రీమా, సేలం, మహమ్మద్, సౌద్, యాహ్యా మరియు హమ్దాన్ అని, వారిలో పెద్దవాడికి 17 సంవత్సరాలు, చిన్నవాడికి 2 సంవత్సరాల వయస్సు ఉందని అతను చెప్పాడు. తైఫ్‌లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్, కింగ్ అబ్దుల్ అజీజ్ స్పెషలిస్ట్ హాస్పిటల్, ప్రిన్స్ సుల్తాన్ హాస్పిటల్‌లో తల్లిదండ్రులు.. ఇద్దరు కుమార్తెలు రెనాద్, మునీరా, ఒక కుమారుడు సుల్తాన్‌ను ఇంటెన్సివ్ కేర్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు









