భారతీయ యూట్యూబర్‌కి సహాయం చేసిన పోలీసులు

- May 03, 2023 , by Maagulf
భారతీయ యూట్యూబర్‌కి సహాయం చేసిన పోలీసులు

యూఏఈ: భారతదేశానికి చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మదన్ గౌరి ఇటీవల ట్యాక్సీలో తన బ్యాగ్‌లను మరచిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని అబుధాబిలోని పోలీసులకు సమాచారం అందించాడు. వారు మదన్ పోగొట్టుకున్న బ్యాగును వెతికి తెస్తామని భరోసా ఇచ్చారు. పోలీసులు చెప్పిన విధంగా తనబ్యాగును తిరిగిపొందిన మదన్.. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నాడు. అబుధాబి అద్భుతంగా ఉందని, ఇక్కడి పోలీసులు తనను ఆశ్చర్యానికి గురిచేశారని తెలిపారు. యూఏఈలో అబుధాబి సురక్షితమైన నగరమని, దేశంలోని సందర్శకులు, నివాసితులు బహిరంగ ప్రదేశాల నుండి తప్పిపోయిన వస్తువులను.. తప్పిపోయిన పిల్లలను కూడా తిరిగి పొందడంలో వారికి సహాయం అందించడంలో ముందుంటామని పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com