ఖతార్ ఎయిర్‌వేస్ కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

- May 03, 2023 , by Maagulf
ఖతార్ ఎయిర్‌వేస్ కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

దోహా: బిజినెస్ ట్రావెలర్ మిడిల్ ఈస్ట్ అవార్డ్స్ 2023లో ఖతార్ ఎయిర్‌వేస్‌కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. దుబాయ్‌లో అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) 2023 సందర్భంగా అవార్డుల వేడుక జరిగింది. ఖతార్ ఎయిర్‌వేస్‌ దాని ప్రయాణీకులకు అసాధారణమైన సేవలను అందించడంలో ఎయిర్‌లైన్ నిబద్ధతను గుర్తించి అవార్డులకు ఎంపిక చేశారు. ఇండస్ట్రీ మ్యాగజైన్ రీజనల్ ఎడిషన్ పాఠకులచే ఓటు వేయబడిన ప్రకారం ఖతార్ ఎయిర్‌వేస్ 'ఉత్తమ వ్యాపార తరగతితో కూడిన ఎయిర్‌లైన్', 'మిడిల్ ఈస్ట్‌కు సేవలందిస్తున్న ఉత్తమ ప్రాంతీయ విమానయాన సంస్థ'గా నిలిచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైంది. ఈ అవార్డులను ఖతార్ ఎయిర్‌వేస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఈస్టర్న్ రీజియన్స్, మర్వాన్ కొలీలాట్ ఎయిర్‌లైన్ తరపున స్వీకరించారు. ఈ వేడుకకు ప్రముఖ పరిశ్రమల ప్రముఖులు, విమానయాన నిపుణులు, ప్రపంచ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com