‘లైగర్’ ఆన్ డ్యూటీ.! VD12 మొదలెట్టేశాడుగా.!
- May 03, 2023
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్‌లో పిచ్చ పిచ్చగా క్రేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ, ‘లైగర్’ సినిమా ఆ క్రేజ్ పూర్తిగా డ్యామేజ్ చేసేసుకున్నాడు.
‘లైగర్’ డిజాస్టర్‌తో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రి తెచ్చుకున్న స్టార్డమ్ అంతా నాశనమైపోయింది. అంతలా ‘లైగర్’ విజయ్ దేవరకొండ అడ్రస్ని గల్లంతు చేసేసింది.
ఇక, రౌడీ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఖుషి’ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు. వీలైనంత తొందరగా ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని ట్రై చేస్తున్న రౌడీకి, సమంత అనారోగ్యం కారణంగా ఆ ఆశ నెరవేరడం లేదు. ఈ మధ్యనే ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే.
ఇదిలా వుంటే, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఒకటి ఆ మధ్య అనౌన్స్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఆ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ రోజు అనగా బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.
త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన శ్రీలీల హీరోయిన్గా ఫిక్సయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







