రెజ్లర్లతో పి.టి. ఉష భేటీ
- May 03, 2023
న్యూఢిల్లీ : రెజ్లర్లతో భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చీఫ్ పి.టి. ఉష భేటీ అయ్యారు. ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేపడుతున్న జంతర్ మంతర్ ప్రాంతానికి బుధవారం పి.టి. ఉష చేరుకున్నారు. వారిని పరామర్శించి.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రెజ్లర్లు క్రమశిక్షణను ఉల్లంఘించారని గతంలో పి.టి. ఉష విమర్శించిన సంగతి తెలిసిందే. క్రీడాకారులు వీధుల్లో నిరసన చేపట్టడం సరికాదని, కమిటీ రిపోర్టు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందని అన్నారు. ఈ చర్య క్రీడకు, దేశ ప్రతిష్టకు మంచిది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రెజ్లర్లు సహా పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు తమను బాధించాయని రెజ్లర్లు పేర్కొన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ అసోసియేషన్ (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
పి.టి. ఉషతో భేటీ అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు. రెజ్లర్లకు అండగా నిలబడి న్యాయం చేస్తానని పి.టి. ఉష చెప్పిందన్నారు. తమ సమస్యను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా బజరంగ్ పునియా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









