ఆహుతులను ఆకట్టుకున్న ‘కళా అర్చన’

- May 03, 2023 , by Maagulf
ఆహుతులను ఆకట్టుకున్న ‘కళా అర్చన’

యూఏఈ: ‘సుస్వర సంగీత వేదిక’, పిరమిడ్ యోగా & డ్యాన్స్ అకాడమీ(PYDA) సంయుక్తంగా ఏప్రిల్ 29న ‘కళా అర్చన’ పేరిట నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. షార్జాలోని అల్ రేయాన్ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూఏఈ, సింగపూర్, ఇండియాలకు చెందిన 80కిపైగా ప్రదర్శనకారులు పాల్గొని తమ నైపుణ్యాలతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. ‘మా గల్ఫ్’ ఈ కార్యక్రమానికి అధికారిక మీడియా పార్టనర్ గా వ్యవహారించింది.

సుస్వర సంగీత వేదిక

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ కళాకారులకు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ, కర్ణాటక సంగీతంలో వారి కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ‘సుస్వర సంగీత వేదిక’ 2015 నుండి ప్రోత్సహిస్తోంది. భారతీయ కర్ణాటక సంగీతం గొప్పతనాన్ని పునరుజ్జీవింపజేయడానికి.. ప్రచారం చేయడానికి 2015లో కర్ణాటక గాయని, శిక్షకురాలు శ్రీలలిత చంద్రశేఖర్ ఈ లాభాపేక్ష లేని, వాణిజ్యేతర సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నారు.

PYDA ఇంటర్నేషనల్-యూకే

పిరమిడ్ యోగా & డ్యాన్స్ అకాడమీ(PYDA)ని వియత్నాంలో 2014లో  మాస్టర్ పి.పద్మావతి స్థాపించారు. "కళలు మరియు ధ్యానం ద్వారా ఆనందకరమైన జీవితం" అనే నినాదంతో.. ప్రజలకు శారీరక, మానసిక, మేధోపరమైన విషయాలలో బోధించడం లేదా శిక్షణ ఇవ్వడం లాంటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా నృత్యం ద్వారా సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సింగపూర్, మలేషియా, మాంచెస్టర్, దుబాయ్, వియత్నాం, ఇండియా, బాలి మొదలైన విదేశాలలో అనేక అద్భుతమైన ప్రదర్శనలను నిర్వహించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com