నాన్ కువైటీలను తొలగించే ముందు బ్యాంకులకు తెలియజేయాలి..!
- May 04, 2023
కువైట్: నాన్ కువైట్ ఉద్యోగులను తొలగించడానికి అధికారులు ఏదైనా నిర్ణయం జారీ చేసే ముందు బ్యాంకులకు తెలియజేయడానికి ప్రభుత్వ ఏజెన్సీలు అంగీకరించాయి. రద్దు చేయబడిన ప్రవాస కార్మికులు తీసుకున్న ఏవైనా రుణాల ఎగవేతను ముందుగానే అడ్డుకునేందుకు బ్యాంకులకు ఇది సహాయం చేస్తుంది. నివాసితులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ వంటి వివిధ సేవా మంత్రిత్వ శాఖలకు తెలియజేయడానికి ప్రభుత్వ ఏజెన్సీలు కూడా అంగీకరించినట్లు సమాచారం. తొలగించబడిన నాన్-కువైట్ ఉద్యోగుల గురించి బ్యాంకులకు తెలియజేయడం, వారి అప్పులు తీర్చకుండా వారు స్వదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఉద్యోగుల ఖాతాలను సస్పెండ్ చేయడం ద్వారా బ్యాంక్ ఆర్థిక స్థితిని కాపాడుకోవచ్చని అర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. బ్యాంక్‌లోని ఉద్యోగి ఖాతాకు జమ చేయబడిన సేవా ముగింపు నష్టపరిహారం నుండి బకాయిలను మినహాయించడం ద్వారా సంబంధిత బ్యాంకులు, సంస్థలను ఆర్థికంగా రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకుముందు కొన్ని ప్రవాస ఉద్యోగులు ప్రభుత్వ ఏజెన్సీలకు బకాయిలు చెల్లించకుండా వారి సేవలను రద్దు చేసిన తర్వాత దేశం విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నయని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







