పత్రికా స్వేచ్ఛలో ఎనిమిది స్థానాలు ఎగబాకిన ఒమన్
- May 04, 2023
మస్కట్: రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఇండెక్స్ ప్రకారం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023లో ఒమన్ సుల్తానేట్ ఎనిమిది స్థానాలు ఎగబాకింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఈ జాబితాను ప్రచురించారు. ఒమన్ సుల్తానేట్ ఈ సంవత్సరం సూచికలో ప్రపంచవ్యాప్తంగా 155వ స్థానంలో ఉంది. 2022 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 163వ స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో నార్వే అగ్రస్థానంలో ఉండగా.. ఐర్లాండ్, డెన్మార్క్ ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. ఇక ర్యాంకింగ్ చివరి ర్యాంకుల్లో వరుసగా ఉత్తర కొరియా, చైనా, వియత్నాం, ఇరాన్ ఉన్నాయి. అనుమతించబడిన పత్రికా స్వేచ్ఛ ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. జాబితాలో ఉన్న 180 దేశాలలో 70% పేద దేశాలు ఉన్నట్లు నివేదికలో తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







