హైదరాబాద్ పై కోల్‌కతా విజయం...
- May 04, 2023
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో సన్‌రైజర్స్ విజయానికి 9 పరుగులు అవసరం అయ్యాయి. మొదటి రెండు బంతులకు రెండు పరుగులు రాగా.. మూడో బంతికి అబ్దుల్ సమద్ ఔట్ అయ్యాడు. మిగిలిన మూడు బంతుల్లో ఒకే పరుగు వచ్చింది.
సన్‌రైజర్స్ బ్యాటర్లలో మార్క్రమ్(41; 40 బంతుల్లో 4 ఫోర్లు), క్లాసెన్(36; 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి(20; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), అబ్దుల్ సమద్(21; 18 బంతుల్లో 3 ఫోర్లు) లు రాణించారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ లు చెరో రెండు వికెట్లు తీయగా హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో రింకూ సింగ్(46; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా(42; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా ఆండ్రీ రస్సెల్(24; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్, నటరాజన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, మార్క్రమ్, మయాంక్ మార్కండే ఒక్కొ వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







