కోహినూర్‌ కంటే అతి పెద్ద వజ్రం దుబాయ్‌లో!

- May 10, 2016 , by Maagulf
కోహినూర్‌ కంటే అతి పెద్ద వజ్రం దుబాయ్‌లో!


ఇండియా, పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌ దేశాల్లో కోహినూర్‌ డిమాండ్‌ వివాదం ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకునే అంశమైంది. బ్రిటన్‌ రాజమాత కిరీటంలో ప్రస్తుతం పొదగబడి ఉన్న ఈ వజ్రం, వాస్తవానికి భారతదేశంలో లభించింది. అలా అలా బ్రిటన్‌కి చేరిన ఈ వజ్రం గురించి వివాదాలు నడుస్తున్నాయి. ప్రపంచంలోనే అతి గొప్ప వజ్రం ఏదంటే అది ఖచ్చితంగా కోహినూర్‌ మాత్రమే. అయితే దీన్ని తలదన్నే వజ్రాన్ని దుబాయ్‌లో తయారు చేయనున్నారట. అంగోలాలో లభ్యమైన రఫ్‌ డైమండ్‌ బరువు 404 క్యారెట్లు. దీన్ని గ్రిసోగోనో సంస్థ పాలిష్‌ చేయనుంది. అత్యంత అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వేస్టేజ్‌ తక్కువగా ఉండేలా ఈ వజ్రానికి మెరుగులు దిద్దుతారు. కోహినూర్‌ వజ్రం రఫ్‌ స్టేజ్‌లో 793 క్యారెట్లు. అనేకసార్లు దాన్ని పాలిష్‌ చేయగా, 105.6 క్యారెట్ల వజ్రంగా రూపొందింది. కోహినూర్‌ కన్నా పెద్దగా తాము కనుగొన్న వజ్రాన్ని రూపొందిస్తామని గ్రిసోగోనో సంస్థ వెల్లడించింది. దుబాయ్‌ వజ్రాల వ్యాపారంలో ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిందనీ, దుబాయ్‌లో తాము వజ్రాల వ్యాపారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com