వారంలో అన్ని రోజులు వాహన పరీక్ష సేవలు

- May 06, 2023 , by Maagulf
వారంలో అన్ని రోజులు వాహన పరీక్ష సేవలు

దుబాయ్ : దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) 30 ఏప్రిల్ నుండి ఆదివారాలతో సహా వారంలోని అన్ని రోజులలో వాహన సాంకేతిక పరీక్ష సేవలను శాశ్వతంగా అమలు చేస్తుంది. రస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రెండు నెలల విజయవంతమైన ట్రయల్ అనంతరం నాలుగు కేంద్రాలకు ఈ సేవలను ఆర్టీఏ విస్తరించింది.  “సాంకేతిక పరీక్ష సేవ ఇప్పుడు ఆదివారాలు కూడా శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. అల్ అవీర్, అల్ తవార్, ఆటోప్రో అల్ మంఖూల్ మరియు ఆటోప్రో అల్ సత్వాలో ఉన్న ENOC తస్జీల్ కేంద్రాలతో అనుబంధంగా ఉన్న పరీక్షా కేంద్రాలకు విస్తరించాం.’’ అని ఆర్టీఏ ప్రకటించింది. ట్రయల్ పీరియడ్‌లో వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆర్టీఏ వాహన లైసెన్సింగ్ డైరెక్టర్ అహ్మద్ మహబూబ్ తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com