సౌదీ నుంచి కువైట్ వెళ్తుండగా కారు ప్రమాదం..భారతీయుడు మృతి

- May 06, 2023 , by Maagulf
సౌదీ నుంచి కువైట్ వెళ్తుండగా కారు ప్రమాదం..భారతీయుడు మృతి

కువైట్: భారత జాతీయుడు లాజి ఎం. చెరియన్ తన కారులో సౌదీ అరేబియా నుండి కువైట్ వెళ్తుండగా.. జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అతను తన ఉద్యోగ రిత్యా సౌదీలో ఉంటారు. తన ఫ్యామిలీని చూసేందుకు కువైట్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాజి M. చెరియన్ ఎన్బీటీసీ(NBTC) కంపెనీ జనరల్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. సౌదీ ప్రాజెక్ట్‌కి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.  కేరళలోని తిరువల్లకు చెందిన మిస్టర్ లాజి ఎం. చెరియన్ కు భార్య అనితా చెరియన్, పిల్లలు జోన్ అచు చెరియన్, జెస్లిన్ ఎల్సా చెరియన్, జేడెన్ అన్నా చెరియన్‌లు ఉన్నారు. అతను సెయింట్ థామస్ ఎవాంజెలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా కువైట్ పారిష్‌లో క్రియాశీల సభ్యుడుగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com