అయ్యో పాపం.! ‘ఆది పురుష్’కి బిజినెస్ కష్టాలా.!
- May 06, 2023
‘బాహుబలి’ సినిమాతో యూనివర్సల్ స్టార్ అయిపోయాడు ప్రబాస్. నిజానికి ఓ స్టార్‌కి ఇది ఎంతో కష్టపడినా దక్కని ఫలితమే. కానీ, ప్రబాస్ పరిస్థితి మరోలా వుంది. యూనివర్సల్ స్టార్ అనిపించుకున్న తర్వాత ప్రబాస్‌తో సినిమా అంటే చాలు ఆ స్థాయిలోనే బడ్జెట్ లెక్కలూ, బిజినెస్ లెక్కలూ వుంటున్నాయ్.
ఇది ప్రబాస్ కెరీర్‌కి మంచి చేస్తుందో, చెడు చేస్తుందో తెలీయడం లేదు. కానీ, ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్‌లుగానే మిగిలిపోయాయ్. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్న చందంగా మారిపోయింది ప్రబాస్ సినిమాల పరిస్థితి.
తాజాగా ప్రబాస్ నుంచి వస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా కూడా అలాగే తయారైంది. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. అయితే, ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచీ ‘ఆది పురుష్’ అంచనాల్ని అందుకోలేకపోతోంది సరికదా.. నెగిటివిటీ మూట కట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘ఆది పురుష్’ భవిష్యత్తు ఎలా వుండబోతోందో.. ఆ తర్వాత ప్రబాస్ సినిమాల భవిష్యత్తు ఎలా వుండబోతోందో.. అని ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
‘ఆదిపురుష్’ బిజినెస్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులే ఈ ఆందోళనకు కారణాలుగా భావించాలేమో.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్‌లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









