ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి

- May 10, 2016 , by Maagulf
ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగర సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. బఖూబా నగరంలో రద్దీగా ఉండే కమర్షియల్‌ ప్రాంతంలో బాంబు పేలడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం నగరంలో షియాలు ఎక్కువగా ఉండే బేకరీ, రెస్టారెంట్‌ సమీపంలోకి మినీబస్‌లో పేలుడు పదార్థాలు నింపుకొని వచ్చి పేల్చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆత్మాహుతి దాడిపై ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. 13 మంది మరణించినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. గతంలో ఈ ప్రాంతంలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు పలుమార్లు దాడులకు పాల్పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com