మహానాడు కోసం 16 కమిటీలు

- May 10, 2016 , by Maagulf
మహానాడు కోసం 16 కమిటీలు

శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో ఘనంగా నిర్వహించే మహానాడు నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటయ్యాయి. తీర్మానాలు, వేదిక ప్రాంగణం, సభా నిర్వహణ, భోజన వసతి, ఆర్థిక వనరులు, రవాణా, పార్కింగ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన వాటి నిర్వహణ కోసం కమిటీలను ఏర్పాటు చేసినట్లు మహానాడు సమన్వయ కమిటీ నేత టీడీ జనార్దన్‌ హైదరాబాద్‌లో తెలిపారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తిరుపతి వేదికగా జరిగే మహానాడుకు సన్నాహకంగా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలను ఈనెల 18, 20 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులు హాజరవుతారని తెలిపారు. 22, 24 తేదీల్లో జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించాలనుంటున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com