అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద మరో పేలుడు

- May 08, 2023 , by Maagulf
అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద మరో పేలుడు

పంజాబ్: పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద ఉన్న హెరిటేజ్ స్ట్రీట్ లో ఈ ఉదయం మరో పేలుడు సంభవించింది. గోల్డెన్ టెంపుల్ కు వెళ్లే మార్గంలోని సారాగర్హి సరాయ్ సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ సహా డాగ్ స్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలికి స్వల్పంగా గాయమయింది. ప్రస్తుత పరిస్థితి సాధారణంగా ఉందని అమృత్ సర్ అసిస్టెంట్ డీసీపీ మెహ్తాబ్ సింగ్ తెలిపారు. ఇదే ప్రాంతంలో నిన్న కూడా బాంబు పేలుడు సంభవించింది. నిన్నటి ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com