నకిలీ ఇన్సూరెన్సు ముఠా గుట్టు రట్టు.. పాలసీదారులను ఎలా మోసం చేస్తున్నారో తెలుసా?
- May 08, 2023
హైదరాబాద్: తెలంగాణలోని రాచకొండ పరిధిలో నకిలీ ఇన్సూరెన్సు ముఠా గుట్టు రట్టు అయింది. రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ఇవాళ మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు.
నిందితులు రూ.4 కోట్ల విలువైన నకిలీ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలు సృష్టించారని తేలిందని తెలిపారు. నిజామాబాద్ కు చెందిన కొసరాజు రంగా సాయి హర్ష ఈ కేసులో ప్రధాన నిందితుడని చెప్పారు. నిజామాబాద్ కి చెందిన మరో నిందితుడు దుప్పల పాటి అక్షయ్ కుమార్ నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ క్రియేట్ చేసేవాడని తెలిపారు.
మేడ్చల్ జిల్లా యాప్రల్ కు చెందిన ఒక ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో ఈ మోసం బయట పడిందని అన్నారు. నిందితులు అందరూ పేరొందిన ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నకిలీ ఇన్సూరెన్స్ లు ఇస్తున్నారని అన్నారు. ఎన్ఆర్ఐ కిషోర్ కుమార్ కు రావాల్సిన డబ్బులు మరో కిషోర్ కుమార్ అకౌంట్ లోకి క్రెడిట్ అయ్యాయని చెప్పారు.
కొంతమంది పాలసీ మెచ్యూరిటీ అయ్యాక కూడా క్లైమ్ కోసం రావడం లేదని అన్నారు. వారికి పాలసీ మెచ్యూరిటీ అయిన విషయం తెలియదని చెప్పారు. మరి కొన్ని పాలసీలలో పాలసీ హోల్డర్ చనిపోయినా.. నామినీకి పాలసీ విషయం తెలియదని అన్నారు. ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు… ఇన్సూరెన్స్ కంపెనీలతో టచ్ లో ఉండటం లేదని అన్నారు.
ఇవన్నీ పేరున్న ఇన్సూరెన్స్ కంపెనీలో రిలేషన్స్ మేనేజర్ గా పనిచేస్తున్న, ఏ1 నిందితుడు రంగ సాయి హర్ష గమనించాడని చెప్పారు. మరో అయిదుగురితో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడని అన్నారు. ఇలాంటి పాలసీల డబ్బులు అన్నింటినీ వారికి తెలిసిన అకౌంట్లలోకి మళ్లించుకునే వారని చెప్పారు. 2019 నుంచి ఇప్పటిదాకా 19 కేసుల్లో రూ.4 కోట్లు కొల్లగొట్టారని తెలిపారు.
నేను షాక్ అయ్యాను: బాధితుడు
బాధితుడు కిషోర్ కుమార్ తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారు. “నేను 13 ఏళ్ల పాత పాలసీ అప్డేట్ కోసం ఐసీఐసీఐ లాంబార్డ్ కి వెళ్లాను. అప్పటికే నా పాలసీ మెచ్యూరిటీ అయింది. డబ్బులు కూడా ఈ-మెయిల్ రెక్వెస్ట్ ప్రకారం.. అకౌంట్ లోకి వెళ్లాయని చెప్పారు. నేను షాక్ అయ్యాను..రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసుల దర్యాప్తులో ఈ మోసం అంతా బయట పడింది” అని తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







