హమద్ ఎయిర్ పోర్ట్: ప్రయాణీకుల రద్దీలో 44.5% పెరుగుదల

- May 08, 2023 , by Maagulf
హమద్ ఎయిర్ పోర్ట్: ప్రయాణీకుల రద్దీలో 44.5% పెరుగుదల

దోహా: హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 2023 మొదటి త్రైమాసికంలో ప్రయాణీకుల రద్దీలో 44.5% పెరుగుదలను, విమానాల మూవ్ మెంట్స్ లో 18.65% పెరుగుదల నమోదు చేసింది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2023 మొదటి త్రైమాసికంలో మొత్తం 10,315,695 మంది ప్రయాణికులు ప్రయాణించారు.  జనవరిలో 3,558,918 మంది ప్రయాణికులు, ఫిబ్రవరిలో 3,240,114 మంది, మార్చిలో 3,516,663 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇదే కాలానికి సంబంధించి మొత్తం 56,417 ఎయిర్‌క్రాఫ్ట్ మూవ్ మెంట్స్ నమోదు కాగా.. ఇందులో  జనవరిలో 19,377, ఫిబ్రవరిలో 17,479, మార్చిలో 19,561 ఎయిర్ క్రాఫ్ట్ లు వచ్చి వెళ్లాయి. అలాగే 2023 మొదటి త్రైమాసికంలో హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 540,000 టన్నులకు పైగా కార్గోను సర్వీసులను నిర్వహించిందని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇంజినీర్ బదర్ మొహమ్మద్ అల్ మీర్ వెల్లడించారు. 2023 మొదటి త్రైమాసికంలో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత రద్దీగా ఉండే గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో లండన్, బ్యాంకాక్, ఢాకా, మనీలా మరియు జెడ్డా వంటి 40 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com