"బ్రదర్‌హుడ్" థీమ్ తో ఇండియన్ స్కూల్ ‘ఇబ్రి’ వార్షికోత్సవం
- May 09, 2023
మస్కట్: ఇండియన్ స్కూల్ ఇబ్రి తన 34వ వార్షిక దినోత్సవాన్ని మే 4న ఎంతో ఉత్సాహంగా, గర్వంగా జరుపుకుంది. వేడుకను "బ్రదర్‌హుడ్" అనే థీమ్ తో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఒమన్ సుల్తానేట్ అల్ దహిరా గవర్నర్ నజీబ్ అలీ అహ్మద్ అల్- రావాస్ లాంగ్వేజ్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, త్రీడీ ల్యాబ్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం స్పోర్ట్స్ మరియు గేమ్స్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు వీలుగా ప్లేగ్రౌండ్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆడిటోరియంలో జరిగిన వార్షిక దినోత్సవ వేడుకలలో పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో కౌన్సెలర్ (లేబర్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్) మస్కట్, భారత రాయబార కార్యాలయం ఇర్షాద్ అహ్మద్, ఒమన్ సుల్తానేట్‌లోని భారతీయ పాఠశాలల BOD చైర్మన్ డాక్టర్ శివకుమార్ మాణికం లు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఎస్‌ఎంసి అధ్యక్షులు నవీన్ విజయకుమార్ అతిథులకు స్వాగతం పలికారు. ప్రిన్సిపాల్ వి.ఎస్. సురేష్, పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







