పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్‌

- May 09, 2023 , by Maagulf
పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పాక్‌ రేంజర్లు అరెస్ట్‌ చేశారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ ఖాన్ ను మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇస్లామాబాద్‌ హైకోర్టులో హాజరుపర్చిన తరువాత ఇమ్రాన్‌ను రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు గతంలో చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన్ను అరెస్టు చేయడం సాధ్యం కాలేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం, దీంతోపాటు కోర్టులో ఆయనకు ఉపశమనం లభించడంతో ఇంతకాలం ఆయన్ను అరెస్టు చేయలేదు. కాగా, ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేస్తున్న సమయంలో కోర్టు దగ్గర గొడవలు చెలరేగాయి. ఇమ్రాన్‌ లాయర్‌కు ఈ గొడవలో తీవ్రగాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com