లియోనెల్ మెస్సీ సౌదీ అరేబియాకు వెళ్లడం ఖాయం..!
- May 10, 2023
పారిస్: అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ సౌదీ అరేబియాలో వచ్చే సీజన్లో "భారీ" ఒప్పందం ప్రకారం ఆడనున్నట్లు ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ మంగళవారం నివేదించింది. “మెస్సీ ఒక ఒప్పందం పూర్తి చేసుకున్నాడు. అతను వచ్చే సీజన్లో సౌదీ అరేబియాలో ఆడతాడు. ఒప్పందం అసాధారణమైనది. ఇది చాలా పెద్దది. మేము కొన్ని చిన్న వివరాలను ఖరారు చేస్తున్నాము. ”అని ఓ కీలకమైన వ్యక్తి తెలిపినట్లు మీడియా కథనం పేర్కొంది.
మెస్సీ ప్రస్తుత క్లబ్ పారిస్ సెయింట్-జర్మైన్ కు జూన్ 30 వరకు ఒప్పందంలో ఉన్నాడని సదరు కథనం తెలిపింది. కాగా, క్లబ్ అతని ఒప్పందాన్ని పునరుద్ధరించాలనుకుంటే, అది ముందుగానే జరిగి ఉండేదని కొందరు తెలిపారు.
35 ఏళ్ల మెస్సీ సౌదీ అరేబియాకు అనధికారిక పర్యటన కోసం వెళ్లడంతో.. ఖతార్ యాజమాన్యంలోని PSG గత వారం సస్పెండ్ చేసింది. అయితే, మెస్సీ సౌదీకి పర్యాటక అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్నాడు. జనవరిలో భారీ ఒప్పందంలో సౌదీ ప్రో లీగ్ క్లబ్ అల్ నాస్ర్‌లో చేరిన అతని ప్రధాన ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డో అడుగుజాడల్లో మెస్సీ కూడా సౌదీ అరేబియా క్లబ్ లో చేరాలని ఫుట్ బాల్ అభిమానులు ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్‌లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!







