ఒమన్ విమానాశ్రయాలకు 94% పెరిగిన రాకపోకలు
- May 10, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన తాజా డేటా ప్రకారం.. ఫిబ్రవరి 2023 చివరి నాటికి ఒమన్ విమానాశ్రయాల ద్వారా అంతర్జాతీయ ఇన్‌బౌండ్ , అవుట్‌బౌండ్ విమానాల సంఖ్య పెరిగింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సలాలా విమానాశ్రయం, సోహార్ విమానాశ్రయం ద్వారా ఇన్‌బౌండ్/అవుట్‌బౌండ్ అంతర్జాతీయ విమానాల సంఖ్య ఫిబ్రవరి 2023 చివరి నాటికి 112.4% పెరిగి 2022లో 6,708తో పోలిస్తే 14,250కి చేరుకుంది. అంతేకాకుండా, మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సలాలా విమానాశ్రయం, సోహార్ విమానాశ్రయం ద్వారా దేశీయ ఇన్‌బౌండ్ / అవుట్‌బౌండ్ విమానాల సంఖ్య 2022లో ఇదే కాలంలో 1,973తో పోలిస్తే 1.1% పెరిగి 1,994కి చేరుకుంది.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సలాలా విమానాశ్రయం, మస్కట్ విమానాశ్రయం, దుక్మ్ విమానాశ్రయం ద్వారా వచ్చే ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ , ట్రాన్సిట్ ప్రయాణీకుల సంఖ్య ఫిబ్రవరి 2023 చివరి నాటికి 2,231,451కి చేరుకోవడంతో ఒమన్ విమానాశ్రయాల ద్వారా వచ్చే వారి సంఖ్య 94% పెరిగింది. అదే నెలాఖరు వరకు విమానాశ్రయాల ద్వారా బయటికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య 2022లో ఇదే కాలంతో పోలిస్తే 113% పెరిగింది.
జాతీయత వారీగా.. ఫిబ్రవరి 2023 చివరి నాటికి 123,130 మంది ప్రయాణికులతో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రయాణికులు 44,233, 37,130 మంది పాకిస్తానీ ప్రయాణీకులు ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







