జాబర్ ఆసుపత్రిలో తొలగిన కార్ పార్కింగ్ కష్టాలు..!

- May 11, 2023 , by Maagulf
జాబర్ ఆసుపత్రిలో తొలగిన కార్ పార్కింగ్ కష్టాలు..!

కువైట్: జాబర్ ఆసుపత్రిలో కార్ పార్కింగ్ సదుపాయం మొత్తం సామర్థ్యం 5,000 కార్లు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కార్ పార్కింగ్‌ల కోసం 3 ప్రాంతాలు ఉన్నాయని, ప్రతి ప్రాంతం మొత్తం 5,000 కార్ల సామర్థ్యంతో 3 అంతస్తులను కలిగి ఉంటుందపి తెలిపింది.

మొదటి దశలోని పార్కింగ్ స్థలాలు గేట్ నెం. 1-2-3 మధ్య, రెండవ దశ పార్కింగ్ స్థలాలు 3-4-5 గేట్‌ల మధ్య ఉండగా.. మూడవ దశ పార్కింగ్, గేట్లు 6-7 మధ్య పఉంటుంది. కొన్ని మెయింటెనెన్స్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న మూడవ స్టేజ్‌లోని పార్కింగ్ స్థలాలు మినహా అన్ని పార్కింగ్ ప్రాంతాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సందర్శకులు ట్రాఫిక్ సూచనలు, నిబంధనలను పాటించాలని, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com