ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

- May 11, 2023 , by Maagulf
ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

ఆస్తమా రోగుల్లో శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. నాలుగు అడుగులు వేసినా ఆయాసం వస్తుంది. గుండె దడగా వుంటుంది. భయం, ఆందోళన తదితర లక్షణాలు ఆస్తమా రోగుల్లో చూస్తుంటాం. 
జలుబు, దగ్గు, వైరస్‌లే ఆస్తమాకి ప్రధాన కారణాలుగా చెప్పుకుంటాం. పదిమంది ఆస్తమా రోగుల్లో ఆరుగురికి చల్లటి గాలి కారణంగా ఆస్తమా వచ్చే ప్రమాదముంటుంది. నలుగురికి, కాలుష్యం, పూల పుప్పొడి ఇతరత్రా కారణాలు కావచ్చు. 
ఆస్తమా రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? మసాలాలూ, శీతల పానీయాలు, చాక్లెట్లు తినకూడదు. దుమ్ము, ధూళి, ఘాటు వాసనలకు కాస్త దూరంగా వుండాలి. చల్లటి నీళ్లతో తలస్నానం చేయడం నిషిద్ధం. గోరువెచ్చని తాగునీటినే ఉపయోగిస్తే మంచిది. పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం చేయకూడదు. 
ఆస్తమాని ప్రాధమిక దశలోనే గుర్తిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకప్పుడు ఆధునిక వైద్యంలో ఆస్తమాకి చికిత్స వుండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. ఆదునిక వైద్యం అందుబాటులో వుంది. ఆస్తమాపై గతంతో పోల్చితే, ఇప్పుడు మంచి అవగాహన కూడా వుంది. 
కానీ, ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com