సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- May 06, 2024
సింగపూర్: 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో, సింగపూర్ లో ప్రవాస భారతీయులతో డా.రామ్ మాధవ్ రచించిన నూతన గ్రంధ పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
డా.రామ్ మాధవ్ ఇటీవల రచించిన ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్ (“The Indian Reality: Changing Narratives, Shifting Perceptions”) పుస్తక పరిచయం & విశ్లేషణ కార్యక్రమం సింగపూర్‌లో మే 4న ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో అనేక స్థానిక భారతీయ సంస్థల అధిపతులతో పాటు సుమారు 100 మంది సింగపూర్ వాసులు పాల్గొన్నారు.
పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ పాలక మండలి అధ్యక్షుడు డా.రామ్ మాధవ్ మాట్లాడుతూ...భారతదేశం చుట్టూ అభివృద్ధి చెందుతున్న కథనంపై అంతర్దృష్టి దృక్కోణాలను పంచుకున్నారు.భారతదేశంలోని ప్రస్తుత పరిపాలన ద్వారా అందించబడిన జవాబుదారీతనాన్ని ఆయన నొక్కిచెప్పారు మరియు సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో యువకులు మరియు విద్యావంతులు పెరుగుతున్న భాగస్వామ్యాన్ని హైలైట్ చేశారు. అంతేకాకుండా, భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని గురుంచి నొక్కిచెప్పారు. ప్రవాసభారతీయులలో వారి వారసత్వం, సంస్కృతి మరియు భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండటంపై అంతర్గత విలువల కోసం గర్వించే భావాలను వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ రామ్ మాధవ్‌తో మరియు సింగపూర్ లో తనకున్న వ్యక్తిగత పరిచయాన్ని నెమరువేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మళ్ళీ తన పాతమిత్రులను కలుసుకోవడం తనలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు.
అనంతరం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమర్ధవంతంగా సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేసారు.'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ పుస్తక సమీక్షను నిర్వహించే అవకాశం కల్పించిన రామ్ మాధవ్ కు మరియు వామరాజు సత్యమూర్తి కి సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమము విజయవంతం అవ్వడం పట్ల నిర్వాహుకులు సంతోషం తెలియచేస్తూ, ఈ కార్యక్రమము విజయవంతం కావడం కోసం అహర్నిశలు కృషిచేసిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, నిర్మల్ కుమార్, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' వ్యవస్థాపక అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలియచేసారు. కార్యక్రమ నిర్వహణకు ఆడిటోరియంని సమకూర్చిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షుడు అతుల్ కి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియచేసారు.ఈ కార్యక్రమం చివరలో "ది ఇండియన్ రియాలిటీ " పుస్తకం మీద రామ్ మాధవ్‌తో హాజరైన సభ్యులు అందరూ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం నిర్వాహుకులు రామ్ మాధవ్ మరియు వామరాజు సత్యమూర్తిని ఘనంగా సన్మానించి తదనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిధులందరికి భోజనం సదుపాయాలు ఏర్పాటుచేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!