టీఎస్ ఖతార్ మహిళల క్రికెట్ టోర్నమెంట్: ఛాంపియన్ గా నిలిచిన అల్ బోర్

- May 11, 2023 , by Maagulf
టీఎస్ ఖతార్ మహిళల క్రికెట్ టోర్నమెంట్: ఛాంపియన్ గా నిలిచిన అల్ బోర్

దోహా: తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ ఖతార్ (TSA Qatar)  మహిళల క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ టోర్న మెంట్ 2023 మే 5న దోహాలోని క్రిక్ ఖతార్ మైదానంలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆరు క్రికెట్ జట్లు నాకౌట్ ఫార్మాట్లో పోటీ పడ్డాయి. ఈ మ్యాచులను చూసేందుకు వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. అల్ బోర్ జట్టు టోర్నీలో ఛాంపియన్ గా నిలిచింది. దోహాకు చెందిన దోహా డేర్ డెవిల్స్ జట్టు రన్నరప్ నిలిచింది.  

ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ ప్రెసిడెంట్ అద్బుల్ రెహమాన్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు, రన్నరఫ్ ట్రోఫీలు.. టోర్నమెంట్ లో పాల్గొన్న జట్ల కెప్టెన్లకు పతకాలు అందించారు. త్వరలో ISC మహిళలకు ఉచిత క్రికెట్ కోచింగ్ ను అందించడానికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ఉమెన్ ఆఫ్ టోర్నమెంట్ గాఅల్ ఖోర్ జట్టు కెప్టెన్ గౌరీ ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ అబ్బగోని మాట్లాడుతూ.. టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్ మరింత మంది అమ్మాయిలు క్రికెట్లో పాల్గొనేందుకు, వారి కలలను సాకారం చేసుకోవడానికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ చేస్తున్న నిబద్ధతకు మహిళా క్రికెట్ టోర్నమెంట్ నిదర్శనమని TSA ఉపాధ్యక్షుడు సయ్యద్ రఫీ అన్నారు.

ఈ కార్యక్రమంలో కెఎస్ ప్రసాద్, ఐసిసి మేనేజింగ్ కమిటీ నుండి సత్యనారాయణ మలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమ రాజు, జనరల్ సెక్రటరీ నిహాద్ మొహమ్మద్ అలీ, క్రికెట్ హెడ్ దీపక్ చుక్కాలా, సభ్యులు రజని, స్వప్న, మల్లిక, శరత్ బాబు, సంతోష్ కుమార్, యెల్లయ్య, తృప్తి కాలే, పురుషోత్తం, శంకర్ గౌడ్(ICBF) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అల్పాహారాన్ని కోనసీమ రెస్టారెంట్ అందించగా.. మ్యాచుల సందర్భంగా ప్లేయర్స్, ప్రేక్షకులకు వాటర్ బాటిళ్లను జాయ్ అలుకాస్ అందజేసింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com