యూఏఈ జలాల్లో కిల్లర్ వేల్స్.. ఎక్కడ ఉన్నాయంటే?

- May 11, 2023 , by Maagulf
యూఏఈ జలాల్లో కిల్లర్ వేల్స్.. ఎక్కడ ఉన్నాయంటే?

యూఏఈ: కిల్లర్ వేల్స్ యూఏఈ సముద్ర జలాల్లో హల్చల్ చేస్తున్నాయి.  ఈజిప్షియన్ నిర్వాసి అహ్మద్ అఫీఫీ, అతని తోటి జాలర్లు చేపట వేటకు వెళ్లిన సమయంలో వీటి సంచారాన్ని గుర్తించి.. అధికారులకు సమాచారం అందించారు. 2008 నుండి వీటి సంచారాన్ని యూఏఈ జలాల్లో చూడలేదని కొందరు జాలర్లు తెలిపారు. సముద్ర జలాల్లో ఇవి సంచరిస్తున్న వీడయోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

అవి హిందూ మహాసముద్రం నుండి వచ్చాయని.. అరేబియా సముద్రం, ఒమన్ సముద్రంలోకి వెళ్లి, ఆపై గల్ఫ్‌కు వెళ్లే అవకాశం ఉందని జస్ట్ ఫిషింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, కో-ఫౌండర్‌ అఫీఫీ తెలిపారు.తొలుత జెబెల్ అలీలో.. ఆ తరువాత షార్జాలో కనిపించాయన్నారు. ఇప్పుడు దుబాయ్, అబుధాబి సముద్ర జలాల్లో అవి చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు.

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎమిరేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా బుధవారం దుబాయ్ జలాల్లో వేల్స్ సంచరిస్తున్న వీడియోను షేర్ చేశారు.  దాంతో తీరంలో తిమింగలాలు కనిపించడంతో బీచ్‌లకు వెళ్లే వారికి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు యూఏఈలో ఈ దృశ్యం దేశ ఆరోగ్యకరమైన సముద్ర వాతావరణానికి నిదర్శనమని అఫీఫీ అన్నారు. ఉదాహరణకు, అబుధాబిలోని జలాలు కింగ్‌ఫిష్, గ్రూపర్స్, గోల్డెన్ ట్రెవల్లీ, కోబియాలతో నిండి ఉన్నాయి. నెట్-ఫిషింగ్, బోనులను నిషేధించిన తర్వాత వీటి సంఖ్య పెరిగినట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com