డేటింగ్ యాప్‌లు, అపరిచితుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను స్వీకరించవద్దు..

- May 12, 2023 , by Maagulf
డేటింగ్ యాప్‌లు, అపరిచితుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను స్వీకరించవద్దు..

యూఏఈ: డేటింగ్ యాప్‌లు, అపరిచితుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను స్వీకరించవద్దని అబుధాబి పోలీసులు హెచ్చరించారు.సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు, బ్లాక్‌మెయిలర్ల ననుంచి నిత్యం ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఈమేరకు గురువారం సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా ప్రైవేట్ ఫోటోలు, వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మోసగాళ్ళు వలలో పడితే బ్లాక్‌మెయిల్, దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. డేటింగ్ సైట్‌లు, యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. 
మోసగాళ్ళ చేతికి చిక్కితే.. 
సైబర్ రాకెట్ల బారిన పడే వారు బెదిరింపులకు లొంగకుండా దృఢంగా ఉండాలని సూచించారు. డబ్బులు పంపొద్దు అని పోలీసులు తేల్చిచెప్పారు. బదులుగా, 24/7 అమన్ సేవ ద్వారా పోలీసులను సంప్రదించడం ద్వారా సంఘటనను నివేదించాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 8002626 (AMAN2626)కి కాల్ చేయవచ్చు లేదా 2828కి SMS పంపవచ్చని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com