జెడ్డా ప్రకటనను ప్రశంసించిన కువైట్

- May 13, 2023 , by Maagulf
జెడ్డా ప్రకటనను ప్రశంసించిన కువైట్

కువైట్: సూడాన్‌లో పౌరులను రక్షించడం.. బాధిత దేశంలో అవసరమైన వారికి సహాయ సామాగ్రిని అందించడంపై జెడ్డా ప్రకటనను కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. పౌరులను రక్షించడానికి, పౌరుల అత్యవసర అవసరాలను తీర్చడానికి మానవతావాద పనులను సులభతరం చేయడానికి నిబద్ధతపై సూడానీస్ సైన్యం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ప్రతినిధులు సంతకం చేసినందుకు సంబంధించి సౌదీ-యుఎస్ ప్రకటనను మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ప్రశంసించింది. సుడానీస్ పార్టీలను చర్చల ఫ్రేంలో కూర్చోబెట్టి, పౌరులను రక్షించే లక్ష్యంతో ఈ ముఖ్యమైన బాధ్యతపై సంతకం చేయాలని నిర్ణయించిన సౌదీ అరేబియా, యుఎస్ లను అభినందించింది. తక్షణం పోరాటాలు, శత్రుత్వాలను నిలిపివేయాలని పిలుపునిచ్చింది. విభేదాలను విడనాలని సుడాన్ భద్రత, స్థిరత్వం, ప్రాదేశిక పరిరక్షణ కోసం ప్రస్తుత సంక్షోభానికి ఆచరణీయమైన మరియు సమగ్రమైన పరిష్కారాన్ని చేరుకోవడం కోసం జాతీయ సంభాషణను కొనసాగించాలని కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com