ఉత్తర ప్రాంత వారసత్వ ప్రదేశాలను సందర్శించిన BACA అధ్యక్షుడు

- May 14, 2023 , by Maagulf
ఉత్తర ప్రాంత వారసత్వ ప్రదేశాలను సందర్శించిన BACA అధ్యక్షుడు

బహ్రెయిన్: అల్-జస్రా క్రాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో ఉత్తర ప్రాంతంలోని వారసత్వం, సాంస్కృతిక ప్రదేశాలను సంరక్షించడంపై చర్చించారు. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన చర్చలో ఉత్తర ప్రాంత మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ షుబర్ అల్-వడాయి, కల్చర్ అథారిటీలోని పురాతన వస్తువులు, మ్యూజియంల విభాగం డైరెక్టర్ సల్మాన్ అల్-మహారి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. 
సమావేశం అనంతరం.. షేక్ ఖలీఫా పురావస్తు, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించే ప్రయత్నాలలో భాగంగా బహ్రెయిన్ ఉత్తర ప్రాంతంలోని సాంస్కృతిక ప్రదేశాల క్షేత్ర పర్యటనకు కూడా వెళ్లారు. వారు జనాబియా శ్మశానవాటికలు, సార్ పురావస్తు ప్రదేశం, షహ్రాకాన్ గ్రామంలోని ఐన్ అల్-హకీమ్ సైట్, హమద్ టౌన్‌లోని నీటిపారుదల కాలువలు సహా అనేక ప్రదేశాలను సందర్శించారు. 
కల్చర్ అథారిటీ, ఉత్తర ప్రాంత మున్సిపల్ కౌన్సిల్ మధ్య సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర ప్రాంతం ముఖ్యమైన వారసత్వం, పురావస్తు ప్రదేశాలను కలిగి ఉంది, దిల్మున్ బరియల్ మౌండ్స్ సైట్ UNESCO వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో నమోదు చేయబడిన మూడవ బహ్రెయిన్ సైట్ కావడం విశేషం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com