చంద్రబాబు నాయుడుకు ఎపి సర్కార్‌ షాక్‌

- May 14, 2023 , by Maagulf
చంద్రబాబు నాయుడుకు ఎపి సర్కార్‌ షాక్‌

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. చంద్రబాబు ప్రస్తుతం అమరావతిలోని కరకట్టపై ఉంటున్న గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేస్తూ వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూల్స్‌ వ్యతిరేకంగా కట్టిన కట్టడమని అందుకే చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. క్రిమినల్‌ లా అమెండ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి నారాయణతో కలిసి తమ పదవును దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారనే ఆరోపణలతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని.. కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్‌ పొందారని అభియోగాలు నమోదయ్యాయి. చట్టాలు, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. వీళ్లు తమ పదవులను వినియోగించుకొని తమ బంధువులు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహించారంటూ అభియోగాలు వచ్చాయి. అయితే వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ఇందుకు ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ తీసుకున్నట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్‌ 1944 చట్టం ప్రకారం ఆ గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేయాలని సిబిఐ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను అధికారులు అటాచ్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com