మక్కాలో టాక్సీ లైసెన్సుల జారీ నిలిపివేత

- May 15, 2023 , by Maagulf
మక్కాలో టాక్సీ లైసెన్సుల జారీ నిలిపివేత

జెడ్డా: పవిత్ర నగరమైన మక్కాలో పబ్లిక్ టాక్సీలకు, ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా మార్చడానికి లైసెన్సుల కోసం దరఖాస్తులను స్వీకరించడాన్ని రవాణా మరియు లాజిస్టిక్స్ మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. ఈ మేరకు రవాణా, లాజిస్టిక్స్ మంత్రి ఇంజినీర్ సలేహ్‌ అల్‌ జాసర్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మే 12న మంత్రిత్వ శాఖ నిర్ణయం వెలువడే ముందు సమర్పించిన దరఖాస్తులకు సంబంధించి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

మంత్రి నిర్ణయం ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియలు, నిబంధనలు, షరతులను ప్రైవేట్ టాక్సీ సంస్థలు దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి మూడు నెలల వ్యవధిలో పూర్తి చేస్తాయి. సౌదీ అరేబియాలోని రోడ్లపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చట్టం, జనరల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నిబంధనలు, పబ్లిక్ టాక్సీలు, టాక్సీ-క్యాబ్ బ్రోకర్లు, గైడెడ్ వాహనాల ఛార్జీలను నియంత్రించే నిబంధనలను ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com