నివాస భవనంలో నార్కోటిక్ మొక్కలు పెంపకం.. నిందితులు అరెస్ట్

- May 16, 2023 , by Maagulf
నివాస భవనంలో నార్కోటిక్ మొక్కలు పెంపకం.. నిందితులు అరెస్ట్

యూఏఈ: యూఏఈలో తమ నివాస అపార్ట్‌మెంట్‌లో నార్కోటిక్ మొక్కలను పెంచుతున్న వారిని యూఏఈ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై షార్జా పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించింది. ఆసియాకు చెందిన అనుమానితులు అక్రమ రవాణా చేయాలనే ఉద్దేశ్యంతో మాదకద్రవ్యాలను పండించినట్లు అభియోగాలు మోపారు. ప్రాసిక్యూషన్ డ్రగ్స్ ఖచ్చితమైన స్వభావాన్ని వెల్లడించలేదు, కానీ గంజాయి మొక్కలను చూపించే ఫోటోను విడుదల చేశారు. అథారిటీ ప్రకారం.. ఒక నివాసి భవనంలోని ఎయిర్ కండిషనింగ్ నిర్వహణ పనిని నిర్వహిస్తుండగా, అక్కడ గంజాయి మొక్కల పెంపకాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఒక పోలీసు బృందం అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి ఆరు మొక్కలను గుర్తించింది. నిందితులు దీని కోసమే అపార్ట్‌మెంట్‌ను రెంట్ కు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com